x
Close
BUSINESS NATIONAL

గుజరాత్ రూ.1.54 లక్షల కోట్లతో సెమీ కండక్టర్ ల పరిశ్రమ-సీ.ఎం భూపేంద్ర పటేల్

గుజరాత్ రూ.1.54 లక్షల కోట్లతో సెమీ కండక్టర్ ల పరిశ్రమ-సీ.ఎం భూపేంద్ర పటేల్
  • PublishedSeptember 13, 2022

అమరావతి: ఆత్మనిర్భర్ భారత్ నినాదంలో భాగంగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రభుత్వం సెమీ కండక్టర్ల తయారీకి కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది..సెమీకండక్టర్ తయారీలో భాగంగా రూ.1.54 లక్షల కోట్ల పెట్టుబడితో గుజరాత్, వేదాంత ఫాక్స్‌కాన్ గ్రూప్స్ సంయుక్తంగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి..ఈ ఒప్పందంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతోపాటు, ఉద్యోగాలు పెరుగుతాయని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పేర్కొంటూ ట్వీట్ చేశారు..దీనిపై ప్రధాని మోడీ  స్పందించారు..ఈ అవగాహన ఒప్పందం భారతదేశ సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమను వేగవంతం వృద్ది చెందే దిశగా అడుగులు వేస్తుందని పేర్కొన్నారు. రూ.1.54 లక్షల కోట్ల పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలను పెంచడానికి మరింత దోహదపడతాయి.. ఒప్పంద కారణంగా అనుబంధ పరిశ్రమల కోసం భారీ పర్యావరణ వ్యవస్థను కూడా సృష్టిస్తుందని,,MSMEలకు సహాయపడుతుందంటూ ప్రధాని ట్విట్ చేశారు.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.