x
Close
NATIONAL

గుజ్జర్లు, బకర్వాల్, పహారీ సామాజిక వర్గాలను ఎస్టీ జాబితాలో చేర్చుతాం-అమిత్ షా

గుజ్జర్లు, బకర్వాల్, పహారీ సామాజిక వర్గాలను ఎస్టీ జాబితాలో చేర్చుతాం-అమిత్ షా
  • PublishedOctober 4, 2022

అమరావతి: గుజ్జర్లు, బకర్వాల్, పహారీ సామాజిక వర్గాలను త్వరలో ఎస్టీ జాబితాలో చేర్చుతామని,,  విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మంగళవారం జమ్ముకశ్మీర్ లో మూడు రోజుల పర్యటనలో భాగంగా రాజౌరీలో నిర్వహించిన భారీ ర్యాలీని అమిత్ షా ప్రారంభించారు.బహిరంగ సభలో అయన మాట్లాడుతూ పహారీలకు ఎస్టీ హోదాను మంజూరు చేస్తే దేశంలో భాషా పరంగా రిజర్వేషన్లు లభించిన మొదటి వర్గంగా నిలుస్తుందని అయితే ఇది జరిగాలంటే కేంద్రం పార్లమెంట్ లో రిజర్వేషన్ల చట్టాన్ని సవరించాలన్నారు. జస్టిస్ శర్మన్ కమిషన్,,, గుజ్జర్లు, బకర్వాల్, పహారీలకు రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసిందని అవి త్వరలోనే అమలవుతాయని అమిత్ షా స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు తరువాతే రిజర్వేషన్ల అమలు సాధ్యమవుతాయని చెప్పారు. ఆర్టికల్ 370, 35ఏ లను తొలగించకుంటే గిరిజనులు రిజర్వేషన్లు పొందడం సాధ్యమయ్యేదా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు వాటిని తొలగించడంతో గిరిజనులు వారి హక్కులు పొందుతారని వెల్లడించారు. 70 సంవత్సరాలుగా కశ్మీర్ ను మూడు కుటుంబాలే పాలించాయని, ప్రజాస్వామ్యాన్ని వాళ్ల కుటుంబాలకే పరిమితం చేశారని తీవ్రంగా విమర్శించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక కశ్మీర్ లో విద్యార్థులకు స్కాలర్ షిప్ లు పెంచామని, 100కు పైగా కొత్త స్కూళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. హైవేల కోసం లక్ష కోట్లు మంజూరు చేశామంటే  ఇవన్నీ ఆర్టికల్ 370 రద్దు తర్వాతే సాధ్యమైయ్యాయని అన్నారు.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.