అమరావతి: బర్మింగ్ హామ్ లో జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఢిల్లీలోని ప్రధానమంత్రి అధికారిక నివాసంలో సమావేశం అయ్యారు..ఈకార్యక్రమంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, కేంద్ర క్రీడల శాఖ సహాయ మంత్రి నిషిత్ ప్రమాణిక్ పాల్గొన్నారు..కామన్ వెల్త్ గేమ్స్ విజేతలతో ముచ్చటించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ,,క్రీడాకారుల అనుభవాలను తెలుసుకున్నారు.. ఈ సందర్భంలో విజేతలైన క్రీడాకారులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ,,కామన్ వెల్త్ క్రీడల ప్రారంభానికి ముందే తాను చెప్పానని,,బర్మింగ్ హోమ్ నుంచి తిరిగి వచ్చిన తరువాత విజయోత్సవం జరుపుకుంటామని,,చెప్పిన మాట ప్రకారం క్రీడాకారులు విజయంతో తిరిగి రావడం ఎంతో సంతోషించే విషయమన్నారు..ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల వేళ బిజిగా ఉన్నప్పటికి.. విజేతలందరినీ కలుసుకోవాలనుకున్నానని,, క్రీడాకారుల స్ఫూర్తిదాయక ప్రదర్శనను ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు.. కామన్ వెల్త్ గేమ్స్ లో చారిత్రాత్మక ప్రదర్శనతో పాటు,,భారత్ తొలిసారి చెస్ ఒలింపియాడ్ ను దేశంలో నిర్వహించుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు..కామన్ వెల్త్ క్రీడలతో పాటు చెస్ ఒలింపియాడ్ లోనూ దేశం పతకాలు సాధించిన క్షణాలు ఎంతో ఆనందాన్ని కలిగించాయన్నారు..చెస్ ఒలింపియాడ్ విజేతకు ప్రధాని నరేంద్రమోదీ మరోసారి అభినందనలు తెలిపారు..కామన్ వెల్త్ క్రీడల్లో 22 బంగారు, 16 రజత, 23 కాంస్య పతకాలతో మొత్తం 61 పతకాలను సాధించిన భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది..
#WATCH | Delhi: Prime Minister Narendra Modi interacted with the Indian contingent that participated in #CWG22, today. Union Sports Minister Anurag Thakur and MoS Sports Nisith Pramanik were also present at the occasion. #CommonwealthGames2022
(Source: PMO) pic.twitter.com/IpP9N9NaHJ
— ANI (@ANI) August 13, 2022