AMARAVATHIDISTRICTS

ఆహార విక్రయ కేంద్రాల్లో అపరిశుభ్రతకు భారీ జరిమానాలు విధిస్తాం-ఆరోగ్యశాఖ అధికారి

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని వ్యాపార వాణిజ్య ప్రాంగణాలను క్రమంతప్పకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ముఖ్యంగా ఆహార విక్రయ కేంద్రాల్లో పరిసరాల పరిశుభ్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ జరిమానాలు విధిస్తామని ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ హెచ్చరించారు. స్థానిక చిల్డ్రెన్స్ పార్కు రోడ్డులోని ప్రధాన మార్గం వెంబడి ఉన్న వివిధ హోటళ్లు, బేకరీలు, ఆహార విక్రయ కేంద్రాల ప్రాంగణాలను డాక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులతో ఆయన మాట్లాడుతూ అన్ని వ్యాపార వాణిజ్య ప్రాంగణాలలో చెత్త బుట్టలను తప్పనిసరిగా వినియోగించాలని, వాటిపై నగర పాలక సంస్థ కేటాయించిన లోగో స్టిక్కర్ ను అతికించాలని సూచించారు..పరిశుభ్రతా ప్రమాణాలను పాటించని వివిధ దుకాణాలకు 10 వేల రూపాయల జరిమానాలు విధించి, కొన్ని దుకాణాలను మూసివేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *