అమర్‌నాథ్ యాత్రికులపై పగపట్టిన ప్రకృతి-15 మంది గల్లంతు?

అమరావతి: అమర్‌నాథ్ యాత్రికులపై ప్రకృతి పగపట్టిందన్నట్లుగా భారీ వర్షం కురిసింది..మంచుశివ లింగం దర్శనానికి వెళ్లిన భక్తులపై ప్రకృతి ప్రతాపం చూపింది..జమ్మూకాశ్మీర్ అమర్నాథ్ ఆలయం వద్ద కుంభవృష్టిగా వర్షం కురుస్తుండడంతో కొండలపైనుంచి వస్తున్న వరదలో వేలాది మంది యాత్రికులు చిక్కుకున్నారు.. దాదాపు 12 వేల మంది యాత్రికులు గుడారాల్లో తలదాచుకున్నారు..భారీగా వచ్చిన వరదకు గుడారాల్లో సేదతీరుతున్న దాదాపు 15 మంది యాత్రికులు కొట్టుకపోయారు..యాత్రికులను రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు..జూన్ 30వ తేదిన అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది.ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండడంతో ప్రస్తుతనాకి అమర్ నాథ్ యాత్రను అధికారులు నిలిపివేశారు.