రాబోయే రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాల సూచన-ఐ.ఎం.డీ

అమరాతి: రాష్ట్రంలో రాబోయే రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది..ప్రస్తుత వాయుగుండం ఆంధ్రప్రదేశ్ పై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం లేకపోయినప్పటికీ,,బలమైన గాలులు వీచే అవకాశాలున్నాయని వెల్లడించింది.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేసింది..బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశా,ఛత్తీస్‌గఢ్ దిశగా కదులుతున్నందున, దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై లేకపోయినప్పటికి తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది..మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు..వాయుగుండం ప్రభావంతో కోస్తా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని,,ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొన్నారు..అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు..భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా, గోదావరి నదులకు వరదలు వచ్చే అవకాశం ఉంటుందని,,అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అదేశించింది..