రాగల 24 గంటలలో నెల్లూరులో 1 లేక 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం- వాతావరణ కేంద్రం

అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేటి సాయంత్రానికి వాయువ్య దిశగా కదిలి అర్ధరాత్రి సమయానికి అదే తీవ్రతను కొనసాగిస్తూ పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందన్నారు.ఆ తర్వాత, అది పశ్చిమ వాయువ్య దిశగా దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి వైపు కదులుతూ ఆ తీరప్రాంతాల వద్ద క్రమంగా బలహీనపడి నవంబర్ 22వ తేదీ ఉదయం నాటికి అల్పపీడన మారుతుందన్నారు.దీని ప్రభావంతో రాయలసీమ ప్రాంతంలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే ఆవకాశం వుందన్నారు…భారీ వర్షపాతం:- రాగల 24 గంటలలో నెల్లూరు జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.