ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం-IMD

అమరావతి: రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది..ఆగ్నేయ బంగాళాఖాతంలో సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడడంతో ఇది ఈ నెల 20వ తేదీ నాటికి అల్పపీడనం మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి కరుణసాగర్ వెల్లడించారు..దీని ప్రభావంతో ఈ నెల 19 నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.తూర్పు గోదావరి, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, శ్రీకాకుళంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. సముద్ర తీర ప్రాంతాల్లో గంటకు 50 కి.మీ. నుంచి 60 కి.మీ. వేగంతో గాలులు వీసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చేపల వేటకు ఈనెల 20వ తేదీ నుంచి 22 వరకు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.రాయలసీమ ప్రాంతంలో ఓ మోస్తురు వర్షాలు కురిసే అవకాశం వుందన్నారు.