బెంగళూరులో భారీ వర్షాల కారణంగా స్తంభిస్తున్న జనజీవనం

అమరావతి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. సమాచార, రవాణా వ్యవస్థ కూడా దెబ్బతినడంతో జనజీవనం స్తంభించింది. ప్రజలు ఇళ్లు దాటి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం మంగళవారం బెంగళూరు మహానగరంలో సెలవు ప్రకటించింది.భారత వాతావరణ శాఖ యెల్లో అలెర్ట్ జారీ చేయడంతో,,బెంగళూరుతోపాటు బెలగావి, ఇతర కర్ణాటక జిల్లాల అధికారులు అప్రమత్తమైయ్యారు.వర్షాల కారణంగా బెంగళూరు నగరంలోని అనేక ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయింది.అలాగే సోమవారం కురిసిన భారీ వర్షంతో రోడ్లపై పెద్ద ఎత్తున చెట్లు కూలిపోయాయి.అనేక చోట్ల మోకాలి లోతు వరకు నీళ్లు నిలిచిపోయాయి.బెంగళూరు-మైసూరు హైవేపై రవాణా చాలా వరకు నిలిచిపోయింది.నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై పర్యటించి,,సహాయక చర్యలు వేగవంతం చేస్తామని ప్రకటించారు.వరద ప్రభావానికి గురైన ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు బోట్లలో సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు.