రాబోయే నాలుగు రోజుల్లో భారీగా వర్షాలు-అధికారులు అప్రమత్తంగా ఉండాలి-కలెక్టర్

నెల్లూరు: రాబోయే నాలుగు రోజులు జిల్లాలో భారీగా వర్షాలు కురిసే ఆవకాశ వున్నందున తీర ప్రాంత మండలాల్లో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడుతూ జిల్లాలో వచ్చే నాలుగు రోజులు 300 నుంచి 400 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ సూచించినందున సోమవారం రాత్రి నుంచి తీర ప్రాంత మండలాల్లో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి మండలంలో ఒక కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేసి జిల్లాస్థాయి కంట్రోల్ విభాగంతో అనుసంధానం చేయాలన్నారు. క్షేత్ర స్థాయి సిబ్బందిని తక్షణ సహాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉంచాలన్నారు.చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులను అప్రమత్తం చేసి తిరిగి వెనుకకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.