ఇక నుంచి భారత్‌లో ఐఫోన్ తయారీ-ఆపిల్ సంస్థ

అమరావతి: ఆపిల్ భారతదేశంలో ఐఫోన్ 14 మోడళ్లను అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించిందని అమెరికన్ దిగ్గజం సంస్థ సోమవారం ప్రకటించింది. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అదే క్యాలెండర్ సంవత్సరంలో మొదటిసారిగా ప్రస్తుత లైనప్‌ను స్థానికంగా ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది. ఆపిల్ కంపెనీకి ప్రస్తుతం భారత్‌లో ఫాక్స్ కాన్ ప్రధాన తయారీదారుగా ఉంది. తమిళనాడులోని చెన్నై శివార్లలోని శ్రీపెరుంబుదూర్‌లో ఐఫోన్ల ఉత్పత్తి జరుగుతోన్న విషయం తెలిసిందే.2017 నుంచి ఇక్కడ ఫోన్ల ఉత్పత్తి జరుగుతున్నప్పటికి, అవి పాత వెర్షన్ ఫోన్ల మాత్రమే. అయితే కొత్త మోడల్ ఐఫోన్ 14ని తొలిసారి భారత్‌లో ఉత్పత్తి చేస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. దేశీయంగా అమ్మకాలతోపాటు విదేశాలకు భారత్ నుంచి ఐఫోన్లు ఎగుమతి కానున్నాయి. ఆపిల్ ప్రకటనపై ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ కంపెనీ జేపీ మోర్గాన్’ స్పందించింది. 2022 చివరి నాటికి ఐఫోన్ 14 గ్లోబల్ ఉత్పత్తిలో 5 శాతాన్ని భారత్‌లో చేపట్టాలని ఆపిల్ కంపెనీ లక్ష్యంగా నిర్దేశించుకుందని,, 2025 నాటికి 25 శాతానికి పెంచాలని భావిస్తోందని పేర్కొంది. చైనాలో ఐఫోన్ ఉత్పత్తిని ఇతర ప్రాంతాలకు మళ్లించాలనే ఆపిల్ ప్రణాళిక భారత్‌లో ఉత్పత్తి ఆరంభించడం ద్వారా స్పష్టమవుతోంది. అలాగే భారత్ కస్టమర్లకు చేరువయ్యేందుకు ఆపిల్ మార్కెటింగ్ ప్రణాళికలను సిద్దం చేసుకొంటుంది..ఇప్పటివరకు చైనాలో ఉత్పత్తయ్యే ఫోన్లపైనే ఆపిల్ ఆధారపడుతూ వస్తొంది..అయతే కొవిడ్ తరువాత ప్రపంచమంతా దాదాపు కరోనా బారి నుంచి బయటపడుతున్నప్పటికి,, చైనాలో మాత్రం ఇంకా పరిస్థితి అదేవిధంగా ఉంది.దీంతో ఆపిల్ పలు సమస్యలు ఎదుర్కొంటుంది..ప్రస్తుతం ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ.79,900 (980 డాలర్లు)గా ఉంది.మరి ఇక్కడ నుంచి ఉత్పత్తి ప్రారంభమై,ఆమ్మకాలు పూర్తి స్థాయిలో మొదలు పెడితే,అప్పుడు మరి ధరలు తగ్గిస్తుందేమో చూడాలి.