అమరావతి: ముంబైలోని నవసేవా పోర్ట్ లో (ఒక తియ్యని వేర్లు గల మొక్క.ఈ వేర్లు చాలా తియ్యగా ఉంటాయి) లైకోరైస్ కు హెరాయిన్ కోటింగ్ వున్న సుమారు 22 టన్నుల పదార్దలతో కూడిన కంటైనర్‌ను బుధవారం స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కమీషనర్ HGS ధాలివాల్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.1,725 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న అతిపెద్ద కేసుల్లో ఇదొకటి అని వెల్లడించారు..కంటైనర్‌ను ఢిల్లీకి తరలించారు..నార్కో టెర్రర్ మన దేశాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో,, అంతర్జాతీయ డ్రగ్ మాఫీయా మన దేశంలోకి డ్రగ్స్ ను పంపడానికి వివిధ పద్ధతులను ఉపయోగిస్తున్నారనేందుకు,ఈ కంటైనర్ లో రవాణ అవుతున్న లైకోరైస్ ఉదాహరణ అని పేర్కొన్నారు..