మిడ్-సీ ఆపరేషన్..
అమరావతి: పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి తరలిస్తున్న రూ.200 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) జాయింట్ ఆపరేషన్‌లో ఆరుగురు పాకిస్తానీ జాతీయులను పట్టుకున్నారు..వారి వద్ద నుంచి 40 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకుంది.. ATS అధికారులు మాట్లాడుతూ, “సరకు పంజాబ్‌కు చేర్చేందుకు వీరి ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందన్నారు.. ఆరుగురు పాకిస్తాన్ జాతీయులు ‘అల్ తయాసా’ అనే ఫిషింగ్ బోట్‌లో ప్రయాణిస్తుండగా వారిని సముద్ర మధ్యలో నిర్వహించిన ఆపరేషన్‌లో పట్టుకొవడం జరిగిందన్నారు..కచ్ జిల్లా జకావ్ ఓడరేవు సమీపంలోని సముద్రంలో చేపలు పట్టే పడవ ద్వారా హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు..ఇటీవలి కాలంలో, గుజరాత్ ATS నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో,, DRI, పంజాబ్,,ఢిల్లీ పోలీసుల వంటి ఏజెన్సీలకు హెరాయిన్‌ను పెద్ద మొత్తంలో రికవరీ చేయడంలో సహాయం చేసింది..ఈ ఏడాది మాత్రమే ఎనిమిది ఆపరేషన్లలో 6,440 కోట్ల రూపాయల విలువైన 1,288 కిలోల మాదక ద్రవ్యాలు, ఎక్కువగా హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.