ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు

హైదరాబాద్: తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సింగల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ ను సమర్ధిస్తూ,,సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది..తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు వెళ్లేందుకు అడ్వకేట్ జనరల్ కొంత సమయం కోరారు..అప్పటి వరకు ఆర్డర్ సస్పెండ్ లో ఉంచాలని అభ్యర్దించారు..ఇందుకు ఆర్డర్ సస్పెన్షన్ కు హైకోర్టు నిరాకరించింది..BRS MLAల కొనుగోలు వ్యవహారంలో ఎటువంటి మనీలాండరింగ్ జరగనప్పటికీ ED కేసు నమోదు చేయడం చెల్లదని MLA పైలట్ రోహిత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితేమే.. ED దాఖలు చేసిన కౌంటర్‌కు సమాధానం ఇవ్వడానికి సమయం ఇవ్వాలని రోహిత్‌రెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేయడంతో,,విచారణ ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది..