ఓఎంసీ కేసులో IAS అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టు క్లీన్‌చిట్

అమరావతి: సీనియర్ IAS అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో ఎలాంటి సాక్ష్యాధారాలు లేనందున శ్రీలక్ష్మిపై ఉన్న అభియోగాలన్నింటినీ కొట్టివేస్తూ హైకోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది.ఇక అమె ఏపీ చీఫ్ సెక్రటరీ గా నియమితులు అయ్యేందుకు వున్న అడ్డంకులు తొలగిపోయాయి. OMC కేసులో శ్రీలక్ష్మి ఏడాది పాటు జైలులో ఉన్నారు. 2004 నుంచి 2009 వరకు శ్రీలక్ష్మి మైనింగ్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు.ఈ కేసుకు సంబంధించి CBI, ఆమెపై నేరారోపణకు సంబంధించిన సరైన వివరాలను కోర్టుకు అందించలేకపోవడంతో కోర్టు ఆమెకు క్లీన్‌చిట్ ఇచ్చింది.కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కేసులో 6వ నిందితురాలు.2011లో ఆమె అరెస్ట్ అయ్యారు.2011లో అక్రమ మైనింగు కేసులో అరెస్టవడంతో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసింది. జైలు నుంచి బెయిల్‌పై విడుదలయిన తర్వాత సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తి వేసింది. అభియోగాల పై కింది కోర్టు నుంచి పై కోర్టు వరకు శ్రీలక్ష్మి తన వాదనలను వినిపించారు. ఇండస్ట్రీయల్ సెక్రటరీగా తన పరిధి దాటకుండా వ్యవహరించారని, మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న బాధ్యతల నేపథ్యంలో OMC వ్యవహరాలను ఆమె చూశారని శ్రీలక్ష్మి తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. శ్రీలక్ష్మి మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సమయంలో చాలా మంది ధరఖాస్తులు చేసుకున్నా గాలి జనార్ధన్ రెడ్డికి మేలు కల్గించేలా వ్యవహరించారని CBI వాదించింది. ఆరు మాసాలుగా ఉన్న లీజును మూడేళ్లకు పొడిగించారని CBI హైకోర్టులో తన వాదనలను విన్పించింది.