MLA రాజాసింగ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

హైదరాబాద్: గోషామహల్ MLA రాజాసింగ్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ బుధవారం మంజూరు చేసింది.ఆయనను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జైలు నుంచి విడుదలయ్యే సమయంలో ర్యాలీలు నిర్వహించకూడదని, మూడు నెలల పాటు సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు, వీడియోలు పోస్ట్ చేయొద్దని అదేశించింది.రాజాసింగ్ పై పోలీసులు పీడీ చట్టం నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ భార్య ఉషా భాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని అడ్వకేట్ జనరల్ ప్రసాద్ అన్నారు. అయితే, ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ ను వ్యతిరేకిస్తూ రాజాసింగ్ తరఫు న్యాయవాది రవిచందర్ కూడా హైకోర్టుకు వాదనలు వినిపించారు. గతంలో పీడీ చట్టం కింద నమోదైన కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసిన సందర్భాలను గుర్తుచేశారు.మంగళవారం ఇరుపక్షల వాదనలు ఆలకించిన హైకోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది.