హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. హిమాచల్లో ఒకే దశలో ఎన్నిక నిర్వహించనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు.శుక్రవారం అయన మీడియా సమావేశంలో మట్లాడారు..ఎన్నికలకు నోటిఫికేషన్ అక్టోబరు 17వ తేదిన విడుదల అవుతుంది..17వ తేది నుంచి 25వ తేది వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29వ తేది వరకు సమయం ఉంటుంది.68 స్థానాలకు నవంబర్ 12వ తేదిన పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 8వ తేదిన కౌంటింగ్ జరగనుంది..ఓటర్లను ఏ రకంగానూ ప్రలోభపెట్టడానికి ప్రయత్నించినా కఠిన చర్యలకు ఉపేక్షించబోమని, చట్ట విరుద్ధ చర్యలను కొనసాగనివ్వకుండా నిఘా పెడతామని సీఈసీ స్పష్టం చేశారు.68 అసెంబ్లీ స్థానాలు ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో పాలన చేపట్టాలంటే 35 స్థానాలు సాధించాల్సి వుంటుంది. హిమాచల్ అసెంబ్లీ గడువు వచ్చే 2023 జనవరితో పూర్తికానుంది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈసీ వివరణ ఇస్తు,,హిమాచల్ ప్రదేశ్ పర్వత ప్రాంతంలో ఎక్కువగా మంచు వుంటుందని,అందువల్లే గతంలో పాటించిన విధానలను అనుసరిస్తూ,ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
Schedule for GE to the Legislative Assembly of Himachal Pradesh.
#AssemblyElections #ECI pic.twitter.com/UnSu7eN19p— Election Commission of India #SVEEP (@ECISVEEP) October 14, 2022