అమరావతి: కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ శుక్రవారం హాకీ వరల్డ్ కప్ ట్రోఫీని ఢిల్లీలోని థ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో ఆవిష్కరించారు. హాకీ ప్రపంచ కప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండువసారని,, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 16 విభిన్న జట్లతో తాము పోటీపడతామన్నారు.41 సంవత్సరాల విరామం తరువాత టోక్యో ఒలింపిక్స్ లో భారత జట్టు పతకం సాధించిందని అనురాగ్ ఠాగూర్ తెలిపారు.ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఒడిశాలో జనవరి 13 నుంచి 29 వరకు హాకీ వరల్డ్ కప్ పోటీలు జరగనున్నాయి.