నెల్లూరు: రూరల్ ఎమ్మేల్యే సమాజంకు పట్టిన చెదల లాంటి వాడని,,అతని వల్ల ప్రజలకు ఎలాంటి న్యాయం జరగదని నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అజీజ్ అన్నారు..నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు..ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ కుటుంబ పాలన సాగుతుందని చెప్పిన శ్రీధర్ రెడ్డి, తన తమ్ముడిని ఎమ్మెల్యేగా ఎలా పరిచయం చేశారంటూ ప్రశ్నించారు..పెద్ద రెడ్ల కుటుంబ పాలన కొనసాగుతుందని శ్రీధర్ రెడ్డి చెబుతున్నారని, వారు కొద్దో గొప్పో మంచి పనులు చేశారు కాబట్టి వారి వారసత్వం కొనసాగుతుందని అన్నారు..శ్రీధర్ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి తనకు అన్యాయం జరిగిందని ముసలి కన్నీరు కారుస్తున్నారని ఎధ్దేవా చేశారు..మానవత్వం లేని వ్యక్తుల్లో రూరల్ ఎమ్మేల్యే శ్రీధర్ రెడ్డి నెంబర్ వన్ అంటూ విరుచుకు పడ్డారు..