x
Close
INTERNATIONAL

అమెరికా వణికిస్తున్నఇయన్ హరికేన్-భారీగా ఆస్తి,ప్రాణ నష్టం

అమెరికా వణికిస్తున్నఇయన్ హరికేన్-భారీగా ఆస్తి,ప్రాణ నష్టం
  • PublishedOctober 2, 2022

అమరావతి: అమెరికా చరిత్రలో1921 తరువాత ఇంత స్థాయిలో చూడని పెను విధ్వంసాన్ని ఇయన్ హరికేన్ సృష్టిస్తోంది. తుపాన్‌ ధాటికి ఫ్లోరిడా దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. ఈ రాష్ట్రం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.ఇయన్ వల్ల ఒక్క ఫ్లోరిడాలోనే 47కు మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తొంది. దక్షిణ కరోలినాపై కూడా ఇయన్ తన ప్రభావం చూపిస్తోంది. చార్ల్‌ స్టన్‌ నగరంలో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటి వరకు హరికేన్ కారణంగా మొత్తంగా 54 మంది వరకు చనిపోయినట్లు సమాచారం.సముద్ర జలాలలో వీధులను మునిగి పోయాయి.157 వేగంతో వీస్తున్న భీకర గాలుల వల్ల చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు నేల ఒరిగాయి.భీకర గాలుల వల్ల కి విద్యుత్ స్థంభాలు నేలకుఒరగడంతో చాలా ప్రాంతాల్లో ప్రజలు అంధకారంలో గడుపుతున్నారు. ఫ్లోరిడా వ్యాప్తంగా సుమారు 2.8లక్షల మంది అంధకారంలో గడుపుతున్నారని అధికారులు తెలిపారు. విద్యుత్‌ను పునరుద్ధరించడానికి సిబ్బంది నిర్విరామంగా పని చేయడంతో పరిస్థితి కాస్త మెరుగైందని పేర్కొన్నారు. తినేందుకు ఆహార పదార్థాలు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర అల్లాడుతున్నారు. ధ్వంసమైన ఇళ్లలో శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించడానికి సహాయక సిబ్బంది బోటుల్లో వెళ్లి మరీ గాలిస్తున్నారు. వరద నీరు పోటెత్తుతుండడంతో తమ కళ్ల ముందే ఇళ్లు కొట్టుకుపోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో చరిత్రలో అత్యంత శక్తిమంతమైన హరికేన్లలో ఈ స్థాయిలో ఆస్తి నష్టాన్ని కలిగించినవాటిలో ఒకటిగా ఇయన్‌ తుపాన్ నిలుస్తోందని అధికారులు పేర్కొన్నారు.ఈ తుపాను కారణంగా సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్​ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *