ప్రతి ఇంటికీ సాంకేతిక పరిజ్ఞానం చేరగలదనే నమ్మకం నాకు వుంది-ప్రధాని మోదీ

5జీ సేవలు ప్రారంభం..
అమరావతి: గ్రామీణ ప్రాంతంలో సైతం ప్రతి ఇంటికీ సాంకేతిక పరిజ్ఞానం చేరగలదనే నమ్మకం తనకు గట్టిగా ఉందని అయితే స్వయం సమృద్ధ భారత దేశం కోసం తాను కన్న కలల పట్ల కొందరు వెటకారం మాట్లాడిన విషయంను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. దేశంలో 5జీ సేవలను శనివారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ విజన్‌లో ఇది అత్యంత గొప్ప ముందడుగు అని చెప్పారు.ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (IMC) 6వ ఎడిషన్‌ను తొలుత ప్రారంభిచారు. తొలి దశలో దేశంలోని 13 నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.ఈ సందర్భంగా అధికారులను పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. రిలయన్స్ జియో ఛైర్మన్, ఆకాష్ అంబానీ త్వరలో దేశవ్యాప్తంగా ప్రారంభించబోతున్న 5G సేవల గురించి ప్రధాని మోడీకి వివరించారు.కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండేళ్లలో దేశవ్యాప్తంగా 5జీ సేవలను విస్తరించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. విడతల వారీగా 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది.డేటాను పంచుకునేందుకు వీలుగా బిలియన్ల కొద్దీ కనెక్ట్ చేసిన పరికరాలను దీనికి అనుసంధానించనున్నాయి. ఈ మొదటి దశ సేవలు అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పూణే నగరాలు ఉన్నాయి.