హేయమైన ఉగ్రదాడి జరిగిన ప్రదేశంలో ఉన్నాను-ఆంటోనియో గుటెర్రెస్

26/11, 2008 ముంబై ఉగ్రదాడి…
అమరావతి: ముంబైలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌లోని స్మారక మ్యూజియం వద్ద 26/11, 2008 ముంబై ఉగ్రదాడిలో మరణించిన ఆమరులకు బుధవారం ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ నివాళులర్పించారు. గుటెర్రస్ తో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొని,మృతులకు నివాళి అర్పించారు. ముంబై ఉగ్రదాడిలో గాయపడి ప్రాణాలతో బయటపడ్డ దేవిక రోటవాన్, ఆంటోనియా గుటెర్రెస్ను కలిశారు. ఉగ్రదాడి బాధితురాలు దేవికతో కాసేపు సంభాషించారు.తాను నాడు జరిగిన ఉగ్రదాడిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్స్ వద్ద గాయపడ్డానని అటు తరువాత కోర్టులో అజ్మల్ కసబ్ ను గుర్తించినట్లు గుటెర్రెస్ కు తెలిపినట్లు దేవిక వెల్లడించింది. టెర్రరిజం ఓ భూతమని,ఉగ్రవాదాన్ని ఏ కారణాలు సమర్థించలేవని ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు. ప్రస్తుత ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటులేదని చెప్పారు.ప్రస్తుతం తాను హేయమైన ఉగ్రదాడి జరిగిన ప్రదేశంలో ఉన్నానని,, నాటి ఉగ్రదాడిలో సుమారు 166 మంది మరణించారని,,అలాంటి సంఘటన పట్ల చాలా చింతిస్తున్నానన్నారు. టెర్రరిజంపై పోరాటం అనేది ప్రతి దేశానికి ప్రాధాన్యత ఆంశం కావాలని సూచించారు. ఉగ్రవాదంపై పోరాటానికి ఐక్యరాజ్యసమితి ఎప్పుడూ మద్దతు ఇస్తుందని వెల్లడించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం భారత్ కు చేరుకున్న ఆంటోనియో గుటెర్రెస్,,తాజ్ హోటల్ వద్ద నివాళి అర్పించారు.నేడు ఐఐటీ ముంబైలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. గురువారం గుజరాత్‌లోని కేవడియాలో జరిగే కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీతో కలసి హాజరవుతారు. ఇందులో భాగంగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి నివాళి అర్పించనున్నారు. అనంతరం దేశంలోనే పూర్తిగా సోలార్ పవర్ ను ఉపయోగిస్తున్న గ్రామాన్ని సందర్శిస్తారు.
Terrorism is absolute evil. No reasons, pretext, causes, grievances can justify terrorism. It has no room in today's world. I feel deeply moved to be here where one of the most barbaric terrorist acts in history took place where 166 people lost their lives: UN Secy-Gen in Mumbai pic.twitter.com/xjleShTx4n
— ANI (@ANI) October 19, 2022