HYDERABAD

ధర్మం కోసం మాట్లాడుతున్నందుకు నన్ను లేకుండా చేస్తారు-ఎమ్మేల్యే రాజాసింగ్

జెండాను ఎగురవేసి..సెల్యూట్ చేయాలి..

హైదరాబాద్: ధర్మం కోసం మాట్లాడుతున్నందుకు తనను వందకు వంద శాతం లేకుండా(ఎమ్మేల్యేగా) చేస్తారని,,ఈ విషయం తనకు కూడా తెలుసని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు..ప్రతి గ్రామంలో హిందువులను టార్గెట్ చేస్తున్నారని,,ఇందులో బాగంగా హిందువులపై వ్యతిరేకంగా హిందువులతోనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారని ఆరోపించారు.. ధర్మం కోసం ఎదిరించి మాట్లాడితే వారి పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నరన్నారు..ధర్మం గురించి మాట్లాడే తనలాంటి వారు కొంతమంది ఉండొచ్చని, దీనిపై మాట్లాడుతున్నందుకు ఇవ్వాళ కాకపోతే రేపు తనపై …ఉపయోగిస్తారని రాజాసింగ్ చెప్పారు..వందకు వంద శాతం తనను తుదముట్టిస్తారని, ఇది పక్కా అని, డేట్ కూడా రాసి పెట్టుకోండని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి..

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కానున్న తరుణంలో భారత ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల సందర్బంగా అందరి ఇళ్లపైనా మువ్వన్నెల జెండా ఎగురవేయాలనే పిలుపులో భాగంగా హైదరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన ఇంటిపై జాతీయ జెండా ఎగురవేశారు..ఈ సందర్భంలో అయన పై విధంగా వ్యాఖ్యనించారు.. అలాగే  ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మహబూబా ముఫ్తీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలకు రాజాసింగ్ సవాల్ విసిరారు.. మీరు నిజమైన దేశ భక్తులు అయితే జాతీయ జెండాను ఎగురవేసి..సెల్యూట్ చేయాలన్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *