చివర శ్వాస వరకు రాజకీయాలు వదలను,మీ చేతులను కూడా వదలను-పవన్ కళ్యాణ్

యువతకు భరోసా..
అమరావతి: వైఎస్ రాజశేఖర్ రెడ్డి ను ఎదుర్కొన్న,,తనకు జగన్ ఓ లెక్క కాదని,,పంచలూడిపోయేలా తరిమికొట్టాలని 2009లోనే పిలుపు నిచ్చానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుర్తు చేశారు..గురువారం శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో వివేకానంద వికాస వేదికపై నిర్వహించిన యువశక్తి సభలో ఆయన మాట్లాడుతూ చివర శ్వాస వరకు రాజకీయాలు వదలను,, మీమల్ని కూడా వదలనని స్పష్టంచేశారు..తాను జనం కోసం ఉందామనుకుంటే తన కోసం ఎవరూ నిలబడలేదని అన్నారు. పైగా రెండు చోట్ల ఓడిపోయావని గేలి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు..రాజకీయాల్లో పుల్ టైమ్ రాజకీయ నాయకులు లేరని,, ప్రస్తుతం అందరూ వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నరని అన్నారు..కపిల్ సిబల్,,చిదంబరం లాంటి వారు కూడా న్యాయవాద వృత్తిలో కొనసాగుతనే రాజకీయాల్లో ఉన్నారన్నారు..తాను ఇప్పటికిప్పుడు కాంట్రాక్టులు చేయలేనని,,రాజకీయాల్లో నిలబడాలంటే తాను సినిమాలు చేయకతప్పదని, డబ్బు అవసరం లేనప్పుడు తానే సినిమాలు వదిలేస్తానని చెప్పారు..తనకు పిరికితనం నచ్చదన్న పవన్.. గెలుపైనా ఓటమైనా తనకు పోరాటమే తెలుసన్నారు…ఇది మూడు ముక్కల ప్రభుత్వం…తను 3 ముక్కుల సీ.ఎం…మాట్లాడితే…3 పెళ్లిళ్లు అంటూన్నరు…ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రికి తెలియదా…నేను ముగ్గురికి విడాడకులు ఇచ్చి చేసుకున్నాను అనే విషయం..నేను ప్రభుత్వం తీసుకుంటున్న విధాన పరమైన నిర్ణయాలను ప్రశ్నిస్తే,,ఈ మూడు ముక్కుల ముఖ్యమంత్రి నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూన్నడంటే అయన ఆలోచనలు మీరు ఆర్ద చేసుకోవాలన్నారు..నేను ఒక కులానికి ప్రతినిధిని కాను నాకు అన్ని కులాల వాళ్లు రాజ్యధికారంలోకి రావలనే జనసేన అనే వేధికను ఏర్పాటు చేశానని చెప్పారు.. వెధవల్ని, గూండాల్ని ఎదుర్కోవడం ఎలాగో తనకు బాగా తెలుసని చెప్పారు..పాలిటిక్స్ లోకి రాకపోతే తనను విమర్శిస్తున్న వాళ్లే, తనతో ఫొటోలు దిగుతారని పవన్ అన్నారు. ప్రజల పక్షాన నిలబడి తిట్టించుకోవడం విజయంగా భావిస్తానని అన్నారు..
డైమండ్ రాణి రోజా:- తనపై విమర్శలు చేసిన మంత్రి రోజాకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు..డైమండ్ రాణి రోజా కూడా తనపై అసభ్యగా మాట్లాడుతోంది అంటూ సెటైర్లు వేస్తూ,,మీ కోసం డైమండ్ రాణిలతో కూడా తిట్టించుకుంటున్నాను అని అన్నారు.. ప్రతి వెధవ, సన్నాసితో మాటలు పడుతున్నానని చెప్పారు..మీ కోసం మీరే నిలబడాలి…మీ కోసం నిలబడే నాయకులకు అండగా నిలవాని అంటూ పవన్ కళ్యాణ్ యువతకు పిలుపునిచ్చారు..