పంచాయతీ నిధులను దుర్వినియోగంపై ప్రశ్నిస్తే,తొటను నరికివేస్తారా-శ్రీధర్

నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలోని పెద్ద అబ్బిపురంలో పంచాయతీకి చెందిన నిధులు దుర్వినియోగం చేశారని ప్రశ్నించినందుకు,ఇమ్మిడిశెట్టి,వెంగయ్య అనే రైతు పొలంలో అధికార పార్టీకి చెందిన మదాందులు 98 మామిడి చెట్లను నరికి వేయడమే కాకుండా, రెండు బోర్లను ధ్వంసం చేయడం జరిగిందని జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్ అన్నారు..మంగళవారం బాధితులతో కలసి ఆత్మకూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించిన సందర్బంలో అయన మాట్లాడారు..నేడు రాష్ట్రవ్యాప్తంగా విష సంస్కృతి వేళ్ళూనుకుంటుందని,,ప్రశ్నించే గొంతులను నొక్కి వేయాలని చూడడం నాయకులకు ఆలవాటుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.. నాయకులను చూసి,అదే బాటలో మండల స్థాయి నాయకులు ప్రవర్తించడం దారుణంమన్నారు..రైతు తొటపై పడి,,అచ్చోసిన ఆంబోతులా బరితెగించి చెట్లను నరకడమే కాకుండా యదేచ్ఛగా గ్రామంలోనే తిరగడం విస్మయానికి గురిచేస్తుందన్నారు..పోలీస్ ఇప్పటికైనా నిందితుని అరెస్టు చేసి విచారించి,బాధితులకు తగిన న్యాయం చేయాలని, లేని పక్షంలో జనసేన పార్టీ ఈ విషయమై ఉద్యమించవలసి వస్తుందని ఈ సందర్భంగా పోలీస్ శాఖకు ఆత్మకూరు జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నామన్నారు..