HYDERABAD

కేసీఆర్ ఈసారి మీ వద్దకొస్తే చెట్టుకు కట్టేసి మూసీ నీళ్లతో స్నానం చేయించండి-సంజయ్

హైదరాబాద్: మూసీ నదిని రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రక్షాళన చేస్తానని… హుస్సేన్ సాగర్ ను కొబ్బరి నీళ్లలా మారుస్తానని హామీలిచ్చిన మాట తప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు బుద్ది వచ్చేలా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ ప్రజలను కోరారు..శుక్రవారం 4వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో భువనగిరి నియోజకవర్గం, పెద్దరావులపల్లి మూసీ బాధిత గ్రామ ప్రజలతో రచ్చ బండ నిర్వహించిన సందర్బంలో బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ ఈసారి మీ వద్దకొస్తే చెట్టుకు కట్టేసి మూసీ నీళ్లతో స్నానం చేయించండి.. ఫినాయల్ పోసి కడగండి…అప్పుడైనా బుద్ది వచ్చి మూసీ ప్రక్షాళన చేస్తాడేమో‘‘అన్నారు..స్థానిక ప్రజలు మూసీ నీటితో పడుతున్న కష్టాలను ఏకరవు పెడుతూ మూసీ నీళ్ల వల్ల తినే తిండి కూడా కలుషితమైపోయిందని వాపోయారు..తమ ప్రాంతాల్లో పెళ్లి చేసుకుందామంటే పిల్లను కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ నీళ్లతో పంటలన్నీ నాశనమవుతున్నాయని… అరోగ్యం దెబ్బతిని చావు బతుకుల మధ్య బతుకు వెళ్లదీయాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు, ఇందుకు సంజయ్ పై విధంగా స్పందించారు..అలాగే ఎన్నికల కోసమో,,ఓట్ల కోసమో మేము ఇక్కడికి రాలేదు..ప్రజల సమస్యలు తెలుసుకోమని మోదీ పంపితేనే ఇక్కడికి వచ్చాం.. పైసలు ఇస్తే ఓట్లు వేస్తారని కేసీఆర్ భ్రమలో ఉన్నారు. ప్రజలు మూసీ కాలుష్యం వలన పంటలు, పొలాలు, ఆరోగ్యాలు ఇలా… అన్ని రకాలుగా నష్టపోతున్నారు.మూసీ ని గోదావరి, హుస్సేన్ సాగర్ ను కొబ్బరి నీళ్ళలా చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైంది?. 2002 లో అద్వానీ గారు మూసీ ప్రక్షాళన కోసం రూ.344 కోట్లు కేటాయించారు..కేసీఆర్ వచ్చాక మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రూ.4000 కోట్లు కేటాయిస్తాం అని అన్నారు. ఇప్పటివరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. సబర్మతి నదిని చూసి వచ్చి, మూసీ ని అలా సుందరీకరిస్తాం అన్న కేసీఆర్… ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేసీఆర్ కు 300 ఎకరాల ఫార్మ్ హౌస్ ఉంది. తన ఫార్మ్ హౌస్ కు నీళ్ల కోసం 200km దూరం ఉన్న కాళేశ్వరం నుంచి నీళ్లు రప్పించుకున్నాడు. అందుకు లక్షా 30వేల కోట్లు ఖర్చు చేశాడు. కేసీఆర్ ఏమో అమీర్ అవుతూ.. మిమ్మల్ని బికారోళ్ళను చేస్తున్నాడంటూ మండిపడ్డారు..మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని,,మూసీ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు..

Spread the love
venkat seelam

Recent Posts

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

19 hours ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

23 hours ago

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదలీ వేటు

అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…

23 hours ago

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ కు 8వ తేదీ వరకు ఓటింగ్‌కు అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ…

23 hours ago

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

2 days ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

2 days ago

This website uses cookies.