ఒక్క ఎమ్మేల్యే ప్రశ్నిస్తే,16 మంది మంత్రులు,ఎమ్మేల్యే,కోఆర్డినేటర్ల మాటల దాడులా-శ్రీధర్ రెడ్డి

నెల్లూరు: అధికారపార్టీ రాబోయే ఎన్నికల్లో 175 కి 175 స్థానలు గెలుచుకుంటాము అన్న ధీమాతో వుంటే,ఒక్క ఎమ్మేల్యేగా నాకు జరిగిని అవమానంపై ప్రశ్నిస్తే,ఇంత మంది చేత మాటల దాడులు ఎందుకు చేయిస్తున్నారు అంటు నిదీశారు.ఆదివారం ఎమ్మేల్యే కార్యలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ తనకు రక్షణగా ఇచ్చిన నాలుగురు గన్ మెన్స్ లో ఇద్దరిని నిన్న తొలగించిందని,మిగిలన ఇద్దరిని తానే సరెండర్ చేస్తున్నట్లు ప్రకటించారు.