నెల్లూరు: దేశంలో జడ్జిలను బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తులు ఎక్కడైనా ఉన్నారా.. ఆ పని కూడా ఈ వైసీపీ నేతలు చేశారు..మనం బాధపడుతుంటే,జగన్ రెడ్డి అయన గ్యాంగ్ పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ టీడీపీ అధ్యక్షడు,మాజీ సింఎ చంద్రబాబు,వైసీపీ ప్రభుత్వంపైన నిప్పులు చేరిగారు.శనివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ నెల్లూరులో కేసుకు సంబంధించిన ఫైళ్లను కోర్టులో దొంగతనం చేశారు…కోర్టులో ఫైళ్లు దొంగతనం చేసే స్థాయికి వచ్చారంటే ఏమనుకోవాలి.? ఏప్రిల్ 11వ తేదీన మంత్రిగా కాకాణి ప్రమాణస్వీకారం చేస్తే.. 13వ తేదీన కోర్టులో దొంగతనం చేసి ఫైళ్లు మాయం చేయించాడు…రాజ్యాంగ వ్యవస్థలన్నింటిపైనా దాడి…న్యాయవ్యవస్థ మొదలు మీడియా, ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.