నేను గెలిస్తే భారత్-అమెరికా మధ్య సంబంధాలను ఉన్నతస్థాయికి-ట్రంప్

అమరావతి: 2024లో జరిగే అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే భారత్-అమెరికా మధ్య బంధాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీ హిందూ విభాగంకు చెందిన భారత సంతతి అమెరికన్లతో ఫ్లోరిడాలోని తన రిసార్టులో నిర్వహించిన దీపావళి విందు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో పై విధంగా ట్రంప్ అన్నారు.తాను భారతదేశంలో పర్యాటించిన సమయంలో అక్కడి ప్రజలు తనపై చూపించిన ప్రేమాభిమానలను మర్చిపోలేన్నన్నారు. హిందువులు, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకు సత్సంబంధాలు ఉన్నాయన్నారు. 2024 ఎన్నికల్లో తాను గెలిస్తే RJS వ్యవస్థాపకుడు షలాభ్ కుమార్ ను అమెరికా రాయబారిగా, భారత్ కు నామినేట్ చేస్తానని వెల్లడించారు.రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానా? అన్న విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదని చెప్పారు. ఒకవేళ తాను పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తానని తెలిపారు. ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ అభ్యున్నతి కోసం తన వద్ద ప్రణాళికలు ఉన్నాయని,, పలు రాష్ట్రాల్లో హిందువుల మద్దతు లేకపోతే తాను 2016 ఎన్నికల్లో విజయం సాధించలేకపోయేవాడినని తెలిపారు.