నెల్లూరు: ప్రభుత్వం ఆసుపత్రిలో రూ.12 లక్షల రూపాయలు వెచ్చిస్తే,ప్రతి రోజు 100 మంది పేషంట్స్ కు ఎక్స్ రే తీసే సౌకర్యం వస్తుందని,అయితే ఈ విషయంలో నాయకులు,అధికారులు నిర్లలక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమని, అధికారులు వెంటనే స్పందించి ఎక్స్ రే రీడింగ్ మెషీన్స్ కొనుగొలు చేయాలని DYFI రూరల్ ఉపాధ్యక్షడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు.సోమవారం నగరంలోని GGH ముందు నిరసన తెలిపిన సందర్బంలో అయన మీడియాతో మాట్లాడారు.