నెల్లూరు: ఆదానీ డిస్టలరిస్ దొంగ కంపెనీ,జగ్గుభాయ్ ఆధ్వర్యంలో నడుస్తుంది..కల్తీ మద్యంతో వేల కోట్ల రూపాయలు జగ్గుభాయ్ ముఠా సంపాదించారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం.వెంకటరమణరెడ్డి అరోపించారు.మంగళవారం నగరంలోని టీడీపీ జిల్లా కార్యలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ వైసీపీ నాయకులను కల్తీ మద్యం గురించి ప్రశ్నిస్తే,,సమాధానం చెప్పకుండా హేరిటేజ్ పాలు అంటూ ఎదురుదాడి చేయడం వాళ్లకే చెల్లిందంటూ మండిపడ్డారు.ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ లో జగ్గుభాయ్ అండ్ టీమ్ కు సంబంధం వుందని ఆరోపించారు.లిక్కర్ స్కామ్ కేసులో శరత్ చంద్రరెడ్డి అప్రూవర్ గా మారే అవకాశం వుందని,,అతను అప్రూవర్ గా మారితే,మద్యం మాఫియాకు సమస్య వస్తుంది కాబట్టి,,శరత్ చంద్రరెడ్డిని,చెవిరెడ్డి.భాస్కర్ రెడ్డి ఢిల్లీలో కలుసుకుని బెందిరించాడా లేక భరోసా ఇచ్చాడా అంటూ ప్రశ్నలు కురిపించారు. లిక్కర్ స్కామ్ లో జగ్గుభాయ్ మాఫియాకు పాత్ర లేకుంటే,చెవిరెడ్డి.భాస్కర్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఈడీ కస్టడిలో వున్న శరత్ కలవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. రిమాండ్ ఖైదీగా ఉన్న శరత్ చంద్రారెడ్డితో, ఎమ్మెల్యే చెవిరెడ్డిని ఈడీ, సీబీఐ అధికారులు ఎలా కలవనిస్తారని ప్రశ్నించారు. శరత్ చంద్రారెడ్డి ప్రాణాలకి జగ్గూభాయ్ మాఫియా వల్ల ప్రాణహాని ఉందని, ఈడీ, సీబీఐ అధికారులు వెంటనే జెడ్ క్యాటగిరీ సెక్యూరిటీ కల్పించాలన్నారు.