అధికారం ఉంది కదా అని దౌర్జన్యాలు చేస్తే,ఏదో ఒకరోజు ప్రజలే తిరగబడతారు-జనసేనాని పవన్

ఇంట్లో నుంచి బాధితులను వెళ్లగొట్టారు..
అమరావతి: పాదయాత్రలో ముఖ్యమంత్రి ఓట్ల కోసం నోటి వచ్చిన హామీలు ఇచ్చేసి,అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని,ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు జనసేన పార్టీ తన వంతు కృషి చేస్తోందని జనసేన పార్టీ అధ్యక్షడు పవన్ కల్యాణ్ అన్నారు..అదివారం రెండో విడత జనవాణి-జనసేన భరోసా కార్యక్రమాన్ని విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య భవన్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన అధినేత ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సీఎం సహాయనిధి, ఆరోగ్యశ్రీకి సంబంధించిన అర్జీలు ఎక్కువగా వచ్చాయని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తున్నట్లు పవన్ చెప్పారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడారు..‘‘ఒక ప్రభుత్వం స్థలం కేటాయించి ఇల్లు మంజూరు చేసింది.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇల్లు కట్టుకునేందుకు రుణం మంజూరు చేసింది.. ఈ క్రమంలో ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న వైకాపా నేతలు ఆ భూమిని లాక్కోవాలని చూస్తున్నారని,,ఇది అత్యంత దారుణం. అన్నారు..20 ఏళ్లుగా ఉంటున్న ఇంట్లో నుంచి బాధితులను వెళ్లగొట్టారు.. రాష్ట్రంలో నాయకులు ఏం చేస్తున్నారో.. కింది స్థాయి నేతలు కూడా అదే చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా ఇలాంటి సమస్యలే ఎక్కువగా నా దృష్టికి వచ్చాయి. ఇలాంటి సమస్యలే ముందుగా నన్ను కదిలించాయన్నారు..అధికార మదంతో కొట్టుకుంట్టున్నారు…ఒక నాయకుడు కబ్జాలు చేసి, లంచాలు తీసుకుంటే భరించగలం.. కానీ ఆ నాయకుడి లక్షణాలు గ్రామ స్థాయి నాయకుల వరకు చేరితే.. ఎక్కడ చూసినా మినీ వైకాపా అధినేతే ఉన్నట్లు అవుతుంది..విశాఖలో కనిపించిన కొండనల్లా మింగేస్తున్నారు..ఈ అన్యాయాలు ఇప్పుడు అడ్డుకోకపోతే ఇవి కొనసాగుతూనే ఉంటాయి..ఏ ఎంపీటీసీ సభ్యుడైతే స్థలాన్ని లాక్కున్నాడో బాధితులకు తిరిగి ఇప్పించాలి…ఈ బాధ్యత వైకాపా మంత్రులు తీసుకోవాలి..అధికారం ఉంది కదా అని దౌర్జన్యాలు చేస్తే.. తీవ్ర ఉద్యమాలే వస్తాయి.. దౌర్జన్యాలు పెరిగితే ఏదో ఒకరోజు ప్రజలే తిరగబడతారు., ప్రజలు మిమ్మల్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తారు’’ అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ హెచ్చరించారు..
దశావతార వెంకటేశ్వరస్వామి:-తొలి ఏకాదశి సందర్భంగా గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు..పూజా కార్యక్రమాల అనంతరం పవన్‌కు అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు.