నన్ను ప్యాకేజీ స్టార్ అంటు కామెంట్ చేస్తే చెప్పుతో కొడతా-పవన్ కళ్యాణ్

అమరావతి: తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ చెప్పు చూపించి మరి, వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో మంగళశారం పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో పవన్,తీవ్రస్థాయిలో వైసీపీ నాయకులపై ధ్వజమేత్తారు.ఇంతకాలం సహనంతో వున్నానని,అయితే తన ఇంట్లోని చిన్నపిల్లలను,తల్లిని ఆవమానించిన భరించానని అయితే ఇక నుంచి అలాంటి పరిస్థితి వుండదు,,నేటి నుంచి ఇక యుద్ధమే అని స్పష్టం చేశారు. ఏపీలో జనసేన ప్రభుత్వం ఏర్పడబోతోందని, సీఎం అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు వైసీపీ తాట తీస్తానని అన్నారు. తప్పుడు మాటలు మాట్లాడితే నిలబెట్టి తోలు వలుస్తా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘వైసీపీ గూండాల్లారా ఒంటి చేత్తో మెడ పిసికేస్తా, ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే కుదరదు, నా వ్యక్తిగత జీవితాని,నా కుటుంబాన్ని కూడా వదల కుండా ఆసభ్యంగా మాట్లాడారంటూ మండిపడ్డారు. చట్ట ప్రకారం విడాకులు ఇచ్చి భరణం చెల్లించాను. మొదటి భార్యకు రూ. 5 కోట్లు, రెండో భార్యకు ఆస్తి రాసిచ్చాను,మీ లాగా ఒక్క పెళ్లి చేసుకుని 30 మందితో కులకడంలేదన్నారు.రాజకీయ ముఖచిత్రం మారబోతోంది..జనసైనికులు సిద్ధంగా ఉండండంటూ పిలుపునిచ్చారు. వైసీపీ నేతలు ఉత్తరాంధ్రలో పర్యటించారా ? అంటూ ప్రశ్నించారు.వైజాగ్ స్టీల్ ప్రైవేట్ పరం కాకుండా కృషి చేస్తా.. కార్మిక సంఘ నేతలు ముందుకు రావాలి.. బీజేపీ, ప్రధాని అంటే గౌరవం ఉంది కానీ వాళ్లకు ఊడిగం చేయను? మంత్రులపై దాడులు జరిగాయంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర గవర్నర్ వద్దకు నా బృందం వెళుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనూ జనసేన పార్టీ నేతలు సిద్ధంగా ఉండాలి.. పార్టీ నేతలు సిద్ధమైతే కొండగట్టు నుంచి యాత్ర మొదలు పెడుదామంటూ పవన్ కళ్యాణ్ సూచించారు.