DISTRICTS

నెలకు రూ.55 నుంచి 200 వరకు చెల్లిస్తే,రూ.3 వేలు ఫించను వస్తుంది-జడ్పీ సిఈఓ వాణి

నెల్లూరు: అసంఘటిత రంగ కార్మికులు, చిరు వ్యాపారుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ పింఛన్ పథకంపై జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేయాలని జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ పిలుపునిచ్చారు..శనివారం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ (PMSYM) పింఛన్ పథకంపై వర్క్ షాప్ నిర్వహించారు..జడ్పీ సీఈవో శ్రీమతి వాణి మాట్లాడుతూ ఆజాది సే అంత్యోదయ తక్ 90 రోజుల కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 75 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని, అందులో మన రాష్ట్రం నుంచి నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలు ఉన్నాయన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా నూతనంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ పింఛన్ పథకాన్ని జిల్లాలో 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల చిరు వ్యాపారులు, ఆశా, అంగన్వాడి కార్యకర్తలు, ఉపాధి హామీ, వ్యవసాయ కూలీలు, డ్రైవర్లు, చేనేత కార్మికులు, డ్వాక్రా మహిళలు మొదలైన అసంఘటిత రంగంలోని కార్మికులు వినియోగించుకునేలా వారికి అవగాహన కల్పించాలన్నారు.  లబ్ధిదారుని వయస్సును బట్టి ప్రతి నెలా రు.55 నుండి రు.200 వరకు బ్యాంకు అకౌంట్ ద్వారా చెల్లిస్తే 60 ఏళ్లు దాటిన తర్వాత వారికి రూ.3000కు తగ్గకుండా పింఛన్ ను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. అన్ని కామన్ సర్వీస్ సెంటర్లు, సచివాలయాల్లో లబ్ధిదారులు ఆధార్, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్ తీసుకెళ్లి ఈ పథకం కింద రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నారు. ఈ పథకం ద్వారా అనేక ప్రయోజనాలు, ప్రతి ఒక్కరూ వృద్ధాప్యంలో ఎంతో భరోసాగా నిలిచే పింఛన్ పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు..ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విచ్చేసిన అనేకమంది అసంఘటిత రంగ కార్మికులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి, గుర్తింపు కార్డులను అందజేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *