HEALTHNATIONAL

హర్ట్ పేషంట్స్ కు శుభవార్త చెప్పిన IIT కాన్పూర్

అమరావతి: గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న బాధితులకు IIT కాన్పూర్ చల్లని వార్త చెప్పింది.. తాము కృత్రిమ గుండెను తయారు చేసినట్లు IIT కాన్పూర్ డైరెక్టర్ అభయ్ కరందికర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చి నెల నుంచి దీనిని జంతువులకు అమర్చి పరీక్షిస్తామని వెల్లడించారు..ఈ ప్రయోగం సక్సెస్ అయితే రాబోయే రెండు సంవత్సరాల్లో మనుషులకు అమర్చుతామని తెలిపారు.. IIT కాన్పూర్ కు చెందిన 10 మంది శాస్త్రవేత్తలు,,దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ హృద్రోగ వైద్యులతో కలిసి ఈ గుండెను తయారు చేసినట్లు పేర్కొన్నారు..గుండె మార్పిడి అవసరమైన వారికి ప్రస్తుతం ఇతరులు తమ గుండెను దానం చేస్తున్నారు..ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా తమ కృత్రిమ గుండె గొప్ప విజయమని అభయ్ తెలిపారు..గుండె వైద్యానికి సంబంధించిన పరికరాలు,, స్టంట్ల వంటివి ప్రస్తుతం 80 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *