జమ్మూ కశ్మీర్ లో, భద్రతా దళాలు చేతిలో హతం అయిన ముగ్గురు ఉగ్రవాదులు

అమరావతి: జమ్మూ కశ్మీర్ భద్రతా దళాలు, ఉగ్రవాదులు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు జమ్ముకాశ్మీర్ పోలీసులు తెలిపారు.. వారి నుంచి ఏకే -47 గన్,,2 రివాల్వర్స్,,బుల్లెట్ తో కూడిన మ్యాగ్ జైన్స్ ను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయని వెల్లడించారు.. జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని ముంజ్ మార్గ్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని,, మరికొందరు ఉగ్రవాదులు ఈ పరిసరలోని రహస్య ప్రాంతాల్లో దాగిఉన్నట్లు భద్రతాబలగాలు భావిస్తున్నాయి..ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు..ఎన్‍కౌంటర్ విషయంపై కశ్మీర్ ఏడీజీపీ మాట్లాడుతూ, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు తెలిపారు. ఇద్దరు ఉగ్రవాదులు షోపియాన్ లోని లతీఫ్ లోన్ ప్రాంతానికి చెందిన వారని వెల్లడించారు.. భద్రతా బలగాల కాల్పుల్లో హతమైన ఉగ్రవాదులు,, కశ్మీర్ పండిట్ పురాన్ కృష్ణభట్,, అనంతనాగర్ కు చెందిన ఉమర్ నజీర్,, నేపాల్ కు చెందిన టిల్ బహదూర్ థాపాలను హత్య చేసిన వారిగా భావిస్తున్నట్లు తెలిపారు.