x
Close
DISTRICTS EDUCATION JOBS

ప్రైవేట్ పాఠశాలల్లో కమిటీలో 80% తల్లిదండ్రులకు అవకాశం ఇవ్వాలి-రమేష్ పట్నాయక్

ప్రైవేట్ పాఠశాలల్లో కమిటీలో 80% తల్లిదండ్రులకు అవకాశం ఇవ్వాలి-రమేష్ పట్నాయక్
  • PublishedDecember 18, 2022

నెల్లూరు: ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఏ ప్రవేట్ పాఠశాల నడుచుకోకపోవడం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ డి. రమేష్ పట్నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆదివారం నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో “విద్య వ్యాపారమా…?, విద్య హక్కు- పిల్లల భవిష్యత్తు” అనే అంశంపై  ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల రాష్ట్ర సదస్సులో పాల్గొన్న సందర్బంలో అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2021లో సవరణ జీవో ప్రవేశపెట్టి పాఠశాలలపై తల్లిదండ్రులకు కొన్ని హక్కులను కల్పించడంతోపాటు కొన్ని నిబంధనలను కూడా విధించిందన్నారు. వాటిలో ఏ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు వారు చెల్లించిన ఫీజును ఆ పాఠశాలలో ఉండే విద్యార్థులపైనే వారి అభివృద్ధికి ఖర్చు చేయాలని చెబుతున్నాయన్నారు.తల్లిదండ్రులతో ప్రైవేట్ పాఠశాలల్లో జరిగే పేరెంట్స్ మీటింగ్ లకు పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యులు కూడా వెళ్లి పాల్గొనాలని,అప్పుడే వారి సమస్యలు అసోసియేషన్ సభ్యులకు తెలుస్తాయని ఆయన సూచించారు.భవిష్యత్తులో పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకువచ్చి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల పై విస్తృత పోరాటం చేయబోతుందని అన్నారు.హైకోర్టు అడ్వకేట్ హెల్ప్ గ్రూప్ కన్వీనర్ జీ.వీ.నాగరాజారావు మాట్లాడుతూ యాజమాన్యాలను, వారి ఆగడాలను అడ్డుకునేందుకు ఎన్నో చట్టాలు ఉన్నాయని,వాటిని అమలు చేసే ప్రభుత్వ వ్యవస్థ సరిగా లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు శిఖరం నరహరి మాట్లాడుతూ ప్రభుత్వం చేసే చట్టాలను,కోర్టుల తీర్పులను లెక్కచేయకుండా వ్యవహరిస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించాలని డిమాండ్ చేశారు. .విద్యను వ్యాపారంగా మారుస్తూ పిల్లల భవిష్యత్తుకు, భద్రతకు ముప్పు ఏర్పడే విధంగా కనీస మౌలిక వసతులు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తున్న యాజమాన్యాలను కఠినంగా శిక్షించాలన్నారు.ఈ సమావేశంలో ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు,  జర్నలిస్ట్ రావూరి రమేష్,  కార్యదర్శి కే శ్రీనివాసులు రెడ్డి, సభ్యులు ఉడత రాజశేఖర్, కే శ్రీకాంత్ రెడ్డి, వాసుదేవరావు, హరినాథ్ రెడ్డి, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్ వింగ్ జిల్లా చైర్మన్ మహేష్, వారి కమిటీ సభ్యులు పలువురు విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.