స్పందనలో ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించిన నెల్లూరు,తిరుపతి,కర్నూలు కలెక్టర్లు

అమరావతి: ప్రజల నుంచి అందే స్పందన అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాలని నెల్లూరు,,తిరుపతి,కర్నూలు జిల్లాల కలెక్టర్స్ K.V.N చక్రధర్ బాబు,K.వెంకటరమణారెడ్డి,,K.కోటేశ్వరరావులు అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో చక్రధర్ బాబు,, తిరుపతి కలెక్టరేట్ లో వెంకట రమణారెడ్డి,,కర్నూలు కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో కోటేశ్వరరావులు వివిధ ప్రాంతాల ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.నెల్లూరులో సంయుక్త కలెక్టర్ ఆర్.కూర్మానాద్, డిఆర్ఓ శ్రీమతి వెంకటనారాయణమ్మ,,తిరుపతిలో డిఆర్ఓ యం.శ్రీనివాసరావు,,కర్నూలులో జాయింట్ కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డితో కలసి ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.