గాంధీ విగ్రహం నుంచి రేపు హర్ ఘర్ తిరంగా ప్రారంభోత్సవ ర్యాలీ-కలెక్టర్

ఉదయం 9 గంటలకు..
నెల్లూరు: జిల్లాలో ఆగస్టు 1వ తేది నుంచి 15వ తేదీ వరకు జరిగే ఆజాదీ కా అమృత్ మహోత్సవం-హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల్లో జిల్లా ప్రజలందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు కోరారు..దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ప్రజల్లో దేశభక్తి భావం, జాతీయ పతాకం పట్ల అవగాహన పెంపొందించడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆజాదీక అమృత్ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.ఇందులో భాగంగా ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమం నిర్వహణ కోసం రాష్ట్రంలో రెండు జిల్లాలు ఎంపిక కాగా అందులో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉండటం జిల్లాకు ఎంతో గర్వకారణమన్నారు..ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయపతాకంతో సెల్ఫీలు దిగడం తో పాటు దేశభక్తిని పెంపొందించే విధంగా సదస్సులు, బృంద చర్చలు, వ్యాసరచనలు, క్విజ్ నాటకాలు ,సంగీతము చిత్రలేఖనం వంటి కళాత్మక రంగాల్లో పోటీలు ర్యాలీలు వారసత్వ నడక నిర్వహించడం వివిధ రకాల గోడపత్రాలు కరపత్రాలు ఇతర ప్రచార సామాగ్రిని విస్తృతంగా వినియోగిస్తామన్నారు.. ఆగస్టు 1వ తేదీ నుంచి 15వ తేది వరకు ప్రతి రోజు ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు..