చైనా యుద్ధ నౌకలకు శ్రీలంక రహస్యంగా ఇంధనం నింపడంపై మండిపడిన భారత్

అమరావతి: చైనా యుద్ధ నౌకలకు శ్రీలంక రహస్యంగా ఇంధనాన్ని నింపండపై భారత్, శ్రీలంకపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీలంక పెను సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సయమంలో భారత్ లంకకు అండగా నిలబడింది. సముద్రంలో గస్తీ నిర్వహిస్తున్న చైనా యుద్ధ నౌకలకు,హంబన్‌తోట నౌకాశ్రయం నుంచి రహస్యంగా ఇంధనాన్ని శ్రీలంక ట్యాంకర్లలో లోడ్ చేస్తున్నాయి. ఈ విషయం భారత్ దృష్టికి రావడంతో శ్రీలంక తీరుపై మండిపడింది.చైనాకు చెందిన బాలిస్టిక్ క్షిపణి ట్రాకింగ్ షిప్ వాంగ్ యువాన్ 5ను హంబన్‌తోట పోర్ట్ వద్ద డాక్ చేయడానికి రణిల్ విక్రమసింఘే ప్రభుత్వం ఇటీవల అనుమతించింది. దీనిపై భారత్, అమెరికా దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. చైనా యుద్ధ, వ్యూహాత్మక నిఘా నౌకలను శ్రీలంక నౌకాశ్రయాలలో డాకింగ్ చేయడానికి అనుమతించవద్దని భారత్, అమెరికా దేశాలు స్పష్టంగా చేశాయి. తమ నౌకాశ్రయాల్లోకి చైనా యుద్ధ నౌకలను అనుమతించడం లేదని శ్రీలంక పేర్కొంది..మరో ప్రక్క చైనా యుద్దనౌకలకు శ్రీలంక, ఇంధనం నిపండం మానుకోవాలని భారత్ హెచ్చరించింది.