మహిళలకు భారత దేశం సురక్షితమైన దేశం

నెల్లూరు: ప్రపంచంలో మహిళలకు భారత దేశం సురక్షితమైన దేశం అనే విషయాన్నిదేశ వ్యాప్తంగా తన సైకిల్ యాత్ర ద్వారా ప్రపంచానికి నిరూపించే ప్రయత్నం చేస్తూ నెల్లూరు నగరానికి చేరుకున్నఆల్ ఇండియా సైకిల్ టూరిస్ట్ ఆషా మాల్వియను మంగళవారం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ చక్రధర్ బాబు సన్మానించి, ఆమెను అభినందించారు.. తన తల్లి రాజు బాయి ప్రోత్సాహంతో పీజీ పూర్తి చేసుకొని నేషనల్ ప్లేయర్ మౌంట్ నీరింగ్ గా ఉంటూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అట్ మౌంట్ నీరింగ్ సాధించడం జరిగిందని, ప్రపంచంలో మహిళలకు భారతదేశం సురక్షితమైన దేశం అనే విషయాన్ని దేశ వ్యాప్తంగా తన సైకిల్ యాత్ర ద్వారా నిరూపించే ప్రయత్నంలో భాగంగా 2022, నవంబర్ 1వ తేదీన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బోపాల్ నుంచి తన సైకిల్ యాత్రను ప్రారంభించడం జరిగిందని ఆమె, జిల్లా కలెక్టర్ కు వివరించారు..ఇప్పటి వరకు మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, రాష్ట్రాల్లో తన సైకిల్ యాత్రను చేసి 8300 కిలో మీటర్ల మేర ప్రయాణించడం జరిగిందని తెలిపారు.25 వేల కిలో మీటర్ల మేర సైకిల్ యాత్ర చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకోవడం జరిగిందని, 2023, ఆగష్టు 15న డిల్లీకి చేరుకోవడంతో నా సైకిల్ యాత్ర పూర్తి అవుతుందని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో హరిత టూరిజం హోటల్ డివిజనల్ మేనేజర్ శివా రెడ్డి, సుపర్వైజర్ ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.