ఐక్యరాజ్య సమితి వేదికగా, ఉగ్రవాదంను ప్రొత్సహిస్తున్న పాక్ పై తీవ్రంగా మండిపడిన భారత్

అమరావతి: ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వేదికగా ముంబై ఉగ్రదాడికి కారణం ఎవరంటూ ఐరాసలో భారత శాశ్వత బృందం ప్రతినిధి,తొలి కార్యదర్శి మిజిటో వినిటో ప్రశ్నించారు.శుక్రవారం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వేదికగా మిజిటో వినిటో మాట్లాడుతూ, పాకిస్థాన్ ప్రధాని తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాశ్మీర్ సమస్యపై షెహబాజ్ చేసిన వ్యాక్యలన్నీ అబద్దాలని,అంతర్జాతీయ వేదికగా పాకిస్థాన్ భారత్ పై ఆరోపణలు చేయడానికి ప్రాధాన్యతనివ్వడం దురదృష్టకరమన్నారు. 1993 ముంబై పేలుళ్ల కారణం అయిన ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంకు పాకిస్థాన్ ఆశ్రయం ఇస్తోందని,శాంతిని కోరుకుంటున్నామని చెబుతున్న పాకిస్థాన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సొంత దేశంలోని సమస్యలు చెప్పకుండా, భారత్ కు వ్యతిరేకంగా షెహబాజ్ మాట్లాడుతున్నారని మిజిటో మండిపడ్డారు.పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటున్నానన్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, టెర్రరిజాన్ని ఎందుకు స్పాన్సర్ చేస్తున్నారో చెప్పాలన్నారు.
పాక్ ప్రధాని:- అంతకుముందు ఐరాస జనరల్ అసెంబ్లీలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ, భారత్ సహా అన్ని పొరుగు దేశాలతో శాంతిని ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. దక్షిణాసియాలో సుస్థిరమైన శాంతి, స్థిరత్వం అనేది జమ్మూ కశ్మీర్ వివాదానికి న్యాయమైన, శాశ్వతమైన పరిష్కారంపై ఆధారపడి ఉంటుందన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ 2019లో భారత్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో శాంతి ప్రక్రియకు విఘాతం కలిగిందని చెప్పారు.