x
Close
NATIONAL

రాబోయే 25 సంవత్సరాల్లో భారత్ అభివృద్ది చెందిన దేశంగా నిలవాలి-ప్రధాని మోదీ

రాబోయే 25 సంవత్సరాల్లో భారత్ అభివృద్ది చెందిన దేశంగా నిలవాలి-ప్రధాని మోదీ
  • PublishedAugust 15, 2022

5 లక్ష్యాలతో ముందుకు సాగుదాం..

అమరావతి: స్వాతంత్య్ర సమరయోధుల కలలను రాబోయే 25 సంవత్సరాల్లో పూర్తి సాకారం చేయాల్సిన బాధ్యత భారతీయులందరిపై ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు..యావత్ జీవితాన్ని దేశం కోసం అంకితం చేసిన త్యాగధనులను దేశం ఎన్నటికి మరువదని ఉద్ఘాంటించారు..76వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలను నిర్వహించుకుంటున్న సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు.. ‘‘మంగళ్ పాండే,,రాజ్ గురు,,తాంతీయ తోపే,,అష్ఫాకుల్లా ఖాన్,,రాంప్రసాద్ బిస్మల్,,భగత్ సింగ్,,బిర్సా ముండా,,అల్లూరి సీతారామరాజు వంటి వాళ్లు ఆంగ్లేయ పాలకులకు గుండెల్లో దడ పుట్టించారన్నారు..రాణి లక్ష్మీ బాయి,,బేగం హజ్రత్ మహల్ భారత నారీ శక్తి సంకల్పం ఎలా ఉంటుందనేది ప్రపంచానికి చాటి చెప్పరన్నారు.. వీరందరినీ గుర్తు చేసుకున్న సమయంలో ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుందని’’ ప్రధాని మోడీ చెప్పారు..దేశపు మట్టిపై ఉన్న ప్రేమతో స్వాతంత్య్ర సమర యోధులు వీరోచిత పోరాటంతో వారి ప్రాణాలను త్యాగం  చేసి,,మనకు స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టారని ప్రధాని మోడీ మనన్నం చేసుకున్నారు..

భిన్నత్వంలో ఏకత్వమే భారత్ కు ఉన్న గొప్ప మహత్తర శక్తి అని ప్రధాని మోడీ పేర్కొన్నారు..ప్రజాస్వామ్యానికి మాతృక భారతదేశమన్నారు..‘‘ 75 సంవత్సరాల్లో మన దేశం ఎన్నో ఎత్తుపల్లాలను చూసిందన్నారు..దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సంకల్పంతో మేం ముందుకు కదులుతున్నమని,,తిరంగా యాత్రల ద్వారా యావత్ దేశం ఏకతాటిపైకి వచ్చిందన్నారు..దేశాన్ని ఏకం చేసే మహత్తర శక్తి మువ్వన్నెల జెండాకు ఉందని,,ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు నిరూపించాయని,,‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ అని మేం పిలుపునిస్తే,,‘సబ్ కా విశ్వాస్.. సబ్ కా ప్రయాస్’ ద్వారా దేశ ప్రజలంతా మా ప్రయత్నంలో భాగస్తులయ్యారు’’ ప్రధాని మోడీ తెలిపారు.. 

రాబోయే 25 సంవత్సరాల్లో 5 లక్ష్యాలపై భారతీయులు దృష్టిసారించాలన్నారు..2047 సంవత్సరం నాటికి దేశ స్వాతంత్య్ర సమరయోధుల కలలను సాకారం చేయాలనే లక్ష్యంతో ముందుకు అడుగు వేయాలన్నారు..1-అభివృద్ధిచెందిన దేశంగా భారత్ ను నిలపడం..2-దేశంలో ఇంకా ఎక్కడైనా కొంచెం బానిసత్వం ఉన్నా నిర్మూలించాలి..3-దేశ చరిత్ర,, స్వతంత్ర పోరాట యోధుల త్యాగాలపై గౌరవం ఉండాలి..4-ప్రజలంతా ఐకమత్యంతో ముందుకు సాగాలి..5-దేశం కోసం దేశ లక్ష్యాల కోసం కృషిచేయాలనే వజ్ర సంకల్పం మనలో ఉండాలి’’ ప్రధాని మోడీ పేర్కొన్నారు..

యువతా మీరే కీలకం..

 ‘‘నేడు 25 ఏళ్ల వయసులో ఉన్న యువత,,మరో 25 సంవత్సరాల తరువాత 50 ఏళ్లకు చేరుతారని,,అప్పటిలోగా మన  భారతదేశంను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే సంకల్పంతో యువత పురోగమించాలి’’ అని మోడీ పిలుపునిచ్చారు.‘‘ మనం ఏది చేసినా,,‘ఇండియా ఫస్ట్’ దృక్పథంతో చేయాలని,,అప్పుడే దేశంలో,, దేశ ప్రజల్లో ఐకమత్య భావన ఏర్పడుతుందన్నారు..స్త్రీ,, పురుష సమానత్వం లేకుంటే,,సమానత్వ భావనకు పరిపూర్ణత చేకూరదు’’ అన్నారు.. మహిళలను గౌరవించడం అనేది నవ భారత కలలను సాకారం చేసేందుకు పునాదిగా మారుతుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు..ప్రసంగం అనంతరం ప్రధాని మోదీ NCC క్యాడెట్ల వద్దకు చేరుకుని వారిని అప్యాయంగా పలకరించారు.. 

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.