x
Close
NATIONAL

చైనా మోహరింపులకు ధీటుగా ప్రళయ్ తో సమాధానం ఇవ్వనున్న భారత్

చైనా మోహరింపులకు ధీటుగా ప్రళయ్ తో సమాధానం ఇవ్వనున్న భారత్
  • PublishedDecember 20, 2022

అమరావతి: భారత్ సరిహద్దులకు సమీపంలో చైనా డ్రోన్లు,యుద్దవిమానలు మోహరిస్తున్న నేపధ్యంలో భారత సైన్యం వ్యూహాత్మక కార్యకలాపాల కోసం తొలిసారిగా LAC వద్ద ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణిని మోహరించాలని సైన్యం నిర్ణయించినట్లు ఎజెన్సీలు వెల్లడించాయి..ఈ క్షిపణి 150 నుంచి 500 కిలోమీటర్ల వరకు తన లక్ష్యాన్ని టార్గెట్ ని చేధింగల ఈ క్షిపణిని 2021 డిసెంబర్‌లో వరుసగా రెండు రోజుల్లో రెండుసార్లు విజయవంతంగా పరీక్షించారు.. అప్పటి నుంచి భారత సైన్యం తన అమ్ములపొదిలో చేర్చుకునేందుకు ఎదురుచూస్తున్నది.. భారత్-చైనా సరిహద్దుల్లో ప్రళయ్‌ క్షిపణిని మోహరించే ప్రక్రియ దాదాపు ప్రారంభమైంది..ఇందులో బాగంగా వచ్చే వారం జరగనున్న ఉన్నత స్థాయి సమావేశంలో దీనికి ఆమోదం లభించే అవకాశం ఉన్నది.. త్రివిధ దళాలు ప్రస్తుతం రాకెట్ ఫోర్స్‌(మూడు విభాగాలను సమన్వయం చేస్తు దాడుల చేసే)ను తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి..ఈ రాకెట్‌ ఫోర్స్‌ నిర్మాణంలో దివంగత జనరల్ బిపిన్ రావత్ ఎంతో కృషి చేశారని నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్కే హరి కుమార్ వెల్లడించారు.. సరిహద్దులో శత్రువులను ఎదుర్కోవడంలో ఈ రాకెట్‌ ఫోర్స్‌ ప్రత్యేకత కలిగి ఉంటుంది. ప్రళయ్‌ క్షిపణిలో సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్ మోటారు అమర్చబడి ఉంటుంది..క్షిపణి మార్గదర్శక వ్యవస్థలో అత్యాధునిక నావిగేషన్,, ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ ఉంటాయి.. ప్రళయ్‌ క్షిపణి 1000 కిలోల బరువున్న పేలుడు పదార్థాన్ని మోసుకెళ్లగలదు..ఇంటర్‌సెప్టర్ క్షిపణులను ఛేదించగలిగే విధంగా ఈ క్షిపణిని అభివృద్ధి చేసినట్లు డీఆర్‌డీఓ వర్గాలు పేర్కొన్నాయి..హోలోకాస్ట్‌ వేగాన్ని డీఆర్‌డీఓ ఇంకా వెల్లడించనప్పటికీ,, ఈ క్షిపణి రాత్రి పూట కూడా శత్రువులను లక్ష్యంగా చేసుకుంటుందని సమాచారం.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.