అంతరిక్ష రంగంలో భారత్ దూసుకుని పోతుంది-ప్రధాని మోదీ

మన్ కీ బాత్..
అమరావతి: అంతరిక్ష రంగంలో దూసుకుని పోతుందన్నఆసూయతో, క్రయోజెనిక్ రాకెట్ టెక్నాలజీని మన దేశానికి ఇచ్చేందుకు అగ్రరాజ్యం ఆంక్షలు విధించిందని, ఆయితే ఇలాంటి పరిస్థితులను భారతీయ శాస్త్రవేత్తలు సవాల్ గా తీసుకుని, మన దేశంలోనే అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధాని మోదీ నిర్వహించే ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పదేళ్ళ క్రితం ఇస్రో సాధించిన ఘన విజయాన్ని గుర్తు చేశారు.నేడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) డజన్లకొద్దీ ఉపగ్రహాలను రోదసిలోకి పంపిస్తోందని చెప్పారు. ఇస్రో పదేళ్ళ క్రితం జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (GSLV) ప్రాజెక్టును విజయవంతం చేసిందన్నారు. క్రయోజెనిక్ ఇంజిన్‌తో GSLV-D5ను విజయవంతంగా ప్రయోగించిందని వెల్లడించారు. అంతకుముందు దశాబ్దాలపాటు మన దేశంపై అమెరికా పుణ్యామ అంటూ, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ (MTCR) ఆంక్షలు అమలవుతూ ఉండేవన్నారు. దీపావళికి ముందు 36 కమ్యూనికేషన్ శాటిలైట్స్ ను ఇస్రో విజయవంతంగా కక్ష్యలలోకి ప్రవేశపెట్టింది. ఇస్రో ఇటీవల విజయవంతంగా ఉపగ్రహాలను పంపించడంతో అంతర్జాతీయ వాణిజ్య విపణిలో భారత దేశం బలమైన పోటీదారుగా నిలిచిందని చెప్పారు.మరో 36 బ్రాడ్‌బ్యాండ్ ఉపగ్రహాలను త్వరలోనే ప్రయోగించబోతోందని ప్రపంచం అంత నేడు భారత్ వైపు చూస్తుందని చెప్పారు.