వెయిట్ లిప్టింగ్ లో మరొ స్వర్ణం సాధించిన భారత్

అమరావతి: కామన్వెల్త్ గేమ్స్ లో వెయిట్ లిప్టింగ్ 67 కేజీల విభాగంలో జెరెమీ లాల్రిన్నుంగా(19) స్నాచ్‌లో 140 కేజీలు,, క్లీన్ అండ్ జెర్క్ లో 180 కేజీలు ఎత్తి మొత్తంగా 300 కేజీలతో స్వర్ణం గెలుచుకోవడమే కాకుండా తన సరికొత్త రికార్డును నెలకొల్పొడు..వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇది రెండో స్వర్ణ పతకం కాగా మొత్తంగా ఇప్పటి వరకు 5వ పతకం..మహిళల విభాగంలో మణిపురి క్వీన్ మీరాబాయి చాను 49 కేజీల విభాగంలో శనివారం భారత్‌కు తొలి పసిడి పతకం అందించింది..రెండోరోజైన శనివారం భారత ఏకంగా నాలుగు పతకాలను తన ఖాతాలో వేసుకుంది..భారత లిఫ్టర్లు సంకేత్ సర్గర్, బింద్యారాణి దేవిరజత పతకాలు సాధించగా, గురురాజ పుజారి కాంస్యంతో మెరిశాడు. దీంతో కామన్వెల్త్‌లో భారత్ ఇప్పటి వరకు సాధించిన పతకాల సంఖ్య ఐదుకు పెరిగింది..పతకాల పట్టికలో భారత్ 8వ స్థానంలో ఉండగా,, 13 స్వర్ణాలు సహా 32 పతకాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది.