భారత నౌకాదళ చెందిన నౌక ప్రజల సందర్శన కోసం కృష్ణపట్నం ఓడరేవులో

నెల్లూరు: 1971 యుద్ధంలో భారత నావికాదళం కరాచీ నౌకాశ్రయంపై జరిపిన దాడి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం డిసెంబర్ 04వ తేదీని నేవీ డేగా జరుపుకుంటుంది. నేవీ డే కార్యక్రమాల్లో భాగంగా భారత నౌకాదళ చెందిన నౌక సుకన్య కృష్ణపట్నం ఓడరేవుకు చేరుకుంటుంది.ఈనెల 18వ తేది ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాల,,కళాశాల విద్యార్థులతో సహా సాధారణ ప్రజల సందర్శన కోసం నౌకలో ప్రవేశం ఉంటుంది. సందర్శకులు భద్రతా కారణాల దృష్ట్యా ఎటువంటి హ్యాండ్‌బ్యాగ్‌లు/లేడీస్ పర్సులు తీసుకురావద్దని సూచించారు.