145 రైళ్లు రద్దు చేసిన ఇండియన్ రైల్వే

10వ తేది కూడా..
అమరావతి: ఇండియన్ రైల్వే మంగళవారం 145 రైళ్లు రద్దు చేయడంతో పాటు మరో 21 రైళ్లు ప్రారంభమయ్యే స్టేషన్ప్ లో మార్పు చేసింది.. వీటితో పాటు 15 రైళ్లను IRCTC పాక్షికంగా రద్దు చేసింది.. ట్రైన్ మెయింటెనెన్స్, ఆపరేషన్స్లో సమస్య తలెత్తిన కారణంగా రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది..ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.. రైల్వే శాఖ బుధవారం సైతం 131 ట్రైన్లు క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించింది..రద్దు చేసిన రైళ్లలో ఎక్కువగా మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ, పంజాబ్, న్యూఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, బెంగాల్, అసోం, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, బీహర్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల మధ్య ప్రయాణించేవి..ఇతర వివరాల కోసం ప్రయాణికులు enquiry.indianrail.gov.in లేదా NTES appను డౌన్ లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు..