భారతీయ విద్యార్థులను తిరిగి చైనాలోకి అనుమతించాలి-ఎస్.జైశంకర్

వాంగ్ యితో సమావేశం
అమరావతి: కరోనా వైరస్ మూలంగా చైనా నుంచి భారత్ కు వచ్చేసిన విద్యార్థులను తిరిగి చైనాలోకి అనుమతించాలని,,విద్యా సంస్థలకు హాజరయ్యేలా చూడాలని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో ఇండోనేషియాలోని బాలిలో సమావేశమైన సందర్భంలో కోరినట్లు ట్వీట్టర్ లో పోస్టు చేశారు.గురువారం ఇరు దేశాల మధ్య నెలకొన్న వివిధ అంశాలపై చర్చించారు..అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ భారత్-చైనా మధ్య సంబంధాలు మూడు అంశాలపై ఆధారపడి ఉన్నాయన్నారు. పరస్పర సున్నితత్వం, పరస్సర అవసరాలు, గౌరవంపై ఆధారపడి ఉన్నాయని జై శంకర్ చెప్పారు..తూర్పు లదాఖ్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఏసీ) వద్ద నెలకొన్న వివాదాన్ని కూడా త్వరగా పరిష్కరించుకోవాలని ఈ చర్చల సందర్భంగా కోరారు..ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను పున:రుద్దరించాలని,, సరిహద్దు సమస్యతోపాటు ఇరు దేశాల మధ్య నెలకొన్న అనేక సమస్యల్ని పరిష్కరించే దిశగా చర్చలు జరిగినట్లు జై శంకర్ పేర్కొన్నారు..