1అమరావతి: భారతదేశం ప్రపంచస్థాయిలో డిజిటల్ పేమెంట్స్ జరిపే దిశగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తొంది.. భారతదేశ పౌరులు నేరుగా యూపీఐ, రూపే ద్వారా ఫోన్ నుంచి డిజిటల్ పేమెంట్స్ ను చేయవచ్చు..ఇందుకోసం యూరప్ దేశాల్లో డిజిటల్ పేమెంట్ సేవలు అందించే ప్రముఖ కంపెనీ ‘worldline’ తో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో కలిసి పనిచేసేందుకు సంబంధించి ఈ రెండు కంపెనీలు అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంతో డిజిటల్ లావాదేవీల విప్లవం దిశగా భారత్ మరో మైలు రాయిని చేరుకుంది.రాబోయే రోజుల్లో యూరప్ దేశాల్లో భారతీయులు ఫోన్ల నుంచి జరిపే యూపీఐ పేమెంట్స్ కు వరల్డ్ లైన్ కు చెందిన క్యూఆర్ కోడ్ వ్యవస్థ సపోర్ట్ చేస్తుంది.దింతో ఆయా దేశాల్లోని అన్ని పాయింట్ ఆఫ్ సేల్ (POS) యంత్రాలలోనూ రూపే డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా భారతీయులు చెల్లింపులు జరుపవచ్చు.